కరోనా బారిన పడిన ముఖ్యమంత్రి

మాయదారి మహమ్మారి కరోనా ఎవర్ని వదిలిపెట్టడం లేదు. సామాన్య ప్రజలనే కాక సినీ , రాజకీయ , బిజినెస్ఇలా అన్ని రానగలవారిని నిద్ర లేకుండా చేస్తుంది. ముఖ్యమంగా రాజకీయనేతలు కరోనా అంటే వణికిపోతున్నారు. ఇప్పటికే చాలామంది దీనిబారిన పడగా…తాజాగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కరోనా వైరస్ బారినపడ్డారు.

ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారందరినీ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరారు. ‘ఈ రోజు నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గత వారం రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నా. నాతో సన్నిహితంగా మెలిగిన వారు వెంటనే సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ఖట్టర్ ట్వీట్ చేశారు.