తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులు , టీచర్లు కరోనా బారిన పడుతున్న తరుణంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
రేపటి నుండి రాష్ర్టంలోని ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థలన్నింటినీ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పాఠశాలల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో మంత్రి సబిత, విద్యా, వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు.