అధికారం కాంగ్రెస్ దే : పొన్నాల

Ponnala-lakshmaiah1

 

తెలంగాణలో కాంగ్రెస్ పాగవేయడం ఖాయమని టీ-పీసీసీ ప్రెసిడెంట్ పొన్నాల పేర్కొన్నారు. కేసీఆర్ చెప్పే బంగారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌ లో పొన్నాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ.. తెలంగాణలో హంగ్ ఏర్పడే ఛాన్స్ లేదని… కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీని సాధిస్తుందని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే అవినీతిరహిత, పారదర్శక పాలనను అందిస్తామని హామీనిచ్చారు.