Site icon TeluguMirchi.com

డిగ్గీరాజా పదవులు ఊడాయి.. !

తెలుగు ప్రజలకి బాగా తెలిసిన పేరు దిగ్విజయ్ సింగ్ అలియాస్ డిగ్గీరాజా. ఆంధ్రప్రదేష్ విభజన సమయంలో డిగ్గీరాజా మంత్రాలు, మాయలని చూసిన అనుభవం తెలుగు ప్రజలకి ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కూడా డిగ్గీరాజా తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా కొనసాగుతూనే ఉన్నాడు. తెలుగు కాంగ్రెస్ నేతలు డిగ్గీరాజాని భరిస్తున్నారు. కానీ, కర్ణాటక, గోవా కాంగ్రెస్ లీడర్లు ఆయన్ని తన్ని తరిమేశారు.

ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో గోవాలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అవతరించింది. అయినా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. అందుకు కారణం గోవాకి కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ గా వ్యవహరించిన డిగ్గీరాజానే అంటూ స్వయంగా కాంగ్రెస్ నేతల బహిరంగంగా ఆరోపించారు. డిగ్గీరాజా మాకొద్దంటూ రాజీనామాలు కూడా చేశారు. దీంతో.. కాంగ్రెస్ అధిష్టానం దిగొచ్చింది.

తాజాగా, కర్ణాటక, గోవా రాష్ట్రాల కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జి పదవి నుంచి దిగ్విజయ్‌ సింగ్‌ను తొలగించారు. కర్ణాటక కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా కేసీ వేణుగోపాల్‌, గోవా కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా చెల్లా కుమార్‌ ను నియమించారు.

Exit mobile version