కాంగ్రెస్ మేనిఫెస్టో 2014

sonia‘మీ వాణి… మా హామీ’ నినాదంతో కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికలకు నేడు మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా మాట్లాడినఅధినేత్రి సోనియా గాంధీ .. సార్వత్రిక ఎన్నికల ప్రణాళిక తయారీకి చాలా కసరత్తు చేశామని, 2014 ఎన్నికల ప్రణాళిక తయారీకి కొత్త పద్ధతి అవలంబించామని వివరించారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పలువర్గాల వారితో సంప్రదింపులు జరిపారని, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఈసారి మరింత వేగవంతంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని చెప్పారు.

ముఖ్యాంశాలు.

* దేశంలో పేదలందరికీ ఇళ్లు
* దేశంలో అందరికీ అందుబాటులో వైద్య సదుపాయాలు
* ధరల నియంత్రణ, మహిళా సాధికారత సాధిస్తాం.
* అవినీతి నిర్మూలనకు కృషిచేస్తాం.
* సాంఘిక భద్రత హక్కు
* 8 శాతం వృద్ధి రేటు
* ఎన్నికలకు సంబంధించిన కేసులన్నీ త్వరితంగా పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థ
* పింఛను హక్కు
* రాజకీయ కార్యక్రమాలకు నిధుల ఖర్చు విషయంలో పారదర్శకత
* ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు
* అవినీతి నిరోధక బిల్లుల ఆమోదానికి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదానికి కృషి