మొత్తానికి టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైపోతున్న తరుణంలో ఇటు కాంగ్రెస్ కూడా ముందస్తు ఎన్నికలతో వరాలకు సిద్ధమైపోయింది. టీపిసిసి చీఫ్ ఉత్తమ కుమార్ రెడ్డి తో నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపారు.
జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన 45నాయకులతో కాంగ్రెస్ ఒక మేనిపెస్టో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం రాష్ట్రంలో వేగవంతగా మారుతున్న రాజకీయ దృష్ట్యా , గురువారమే అసెంబ్లీ రద్దు నిర్ణయం వస్తుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి ఉత్తమ కుమార్ రెడ్డి తో మేనిపెస్టో కమిటీ చర్చించి మేనిపెస్టోలో ఉన్న అంశాలలో కొన్నింటిని ప్రకటించడం జరిగింది. పూర్తి మేనిపెస్టో మరో రెండు, మూడు విడుదల చేస్తాం అని ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ మేనిపెస్టోలోని అంశాలు :
* 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల ఉచిత ప్రమాద భీమా
* ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొన్న వారికీ అదనంగా రూ. 3 లక్షలు
* ఇంటి స్థలం ఉన్న అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు, ఎస్సి ,ఎస్టీలకు రూ. 6 లక్షలు
* అన్ని రకాల పెన్షన్ లు రెట్టింపు
* కల్యాణి లక్ష్మి సహా బంగారు తల్లి పధకం పునరుద్ధరణ
* ఎస్సి , ఎస్టీ , మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు
* విద్య , వైద్య సౌకర్యాలను ఉచితంగా అందజేసేందుకు ప్రణాళికలు