హుజూరాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీతో పాటు విపక్షాలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ క్రమంలో అన్ని పార్టీలు స్థానికంగా పట్టు ఉన్న నేతలనే తమ అభ్యర్థులుగా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే తెరాస, బీజేపీ లు తమ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ బరిలో నిలవబోయే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌ని తమ అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ.
ఈ సందర్భంగా వెంకట్ మాట్లాడుతూ…
తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ అభ్యర్థిగా అవకాశం కల్పించిన ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ,మాజీ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ,తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ శ్రీ మాణిక్యం ఠాకూర్,టిపిసిసి అధ్యక్షులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి వెంకట్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.
ఎల్బీ నగర్ వద్ద పోలీసుల తోపులాటలో స్పృహ కోల్పోయి ఒమేగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వెంకట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015 కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన NSUI రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికై,మరోసారి 2018 లో రాష్ట్ర అధ్యక్షునిగా తిరిగి ఎన్నిక కావడంలో ముఖ్య భూమిక రాహూల్ గాంధీ ప్రవేశపెట్టిన NSUI ఎన్నికల ప్రక్రియ వల్లే మధ్యతరగతి కుటుంబానికి చెందిన తనలాంటి వారు నేడు ఎమ్మేల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగారని.ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకున్నా కూడా తన కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎమ్మేల్యే అభ్యర్థిగా అవకాశం కల్పించడం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని.హుజురాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తానని వెంకట్ బరోసా వ్యక్తం చేశారు.