కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం !!!

sonia-pm_వింటర్‌ సెషన్స్‌ హీట్‌ పెంచుతున్నాయి. కాంగ్రెస్‌ కు చెమటలు పట్టిస్తున్నాయి. సొంత పార్టీ నేతలు విసిరిన బాణానికి అధిష్టానం గింగరాలు తిరుగుతోంది. ఢిల్లీ పీఠం కదులుతుందేమోనని హడలిపోతుంది. స్వపక్ష నేతల తిరుబాటు కునుకులేకుండా చేస్తుంటే …మరోవైపు విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని వాడుకోవాలి ఆరాటపడుతున్నారు. దీంతో ఏక్షణంలో ఏం జరగుతుందో అన్న టెన్షన్ తో రాజకీయ వేడి రాజుకుంది.

కాంగ్రెస్‌ పార్టీకి , యుపీఏకు చివరి గంటికలు మోగుతున్నాయి. సెమీఫైనల్స్‌ లో చావు దెబ్బ తిన్న హస్తం పార్టీ మెడపై ఇప్పుడు అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ నేతలే సొంత ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టడంతో కేంద్ర ప్రభుత్వం నైతికంగా విశ్వాసం కోల్పోయిందనే చెప్పాలి. ఇప్పటికే బోటాబోటి మెజార్టీతో ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్‌ సర్కార్‌ కు ఇది పెద్ద షాక్‌ అనే చెప్పాలి. శీతాకాల సమావేశాల్లో పలు బిల్లు లు ఆమోదించి ప్రజల తో శభాష్‌ కాంగ్రెస్‌ అనిపించుకోవాలనుకున్న సోనియకు జరగుతున్న పరిణామాలు మింగుడుపడటం లేదు. బిల్లుల మాట అటుంచితే అసలు ప్రభుత్వం ఉంటుందో ఊడుగతుందో అన్న భయం అమ్మ కు వెంటాడుతోంది.

parlimentఅవిశ్వాసంపై స్పీకర్‌ మీరాకుమార్‌ సభలో ప్రకటన చెయ్యడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే నోటుసులు ఇచ్చిన 13 మంది ఎంపీలకు మరో 70 మంది ఎంపీలు మద్ధతు తెలిపినట్టు జాతీయ ఛానెల్స్‌ లో విస్తృతంగా ప్రచారం జరగుతోంది. ఈక్రమంలో సభలో అవిశ్వాసంపై చర్చ , ఓటింగ్‌ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు విపక్ష పార్టీలు సైతం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరాటపడుతున్నాయి. అంతేకాదు యుపీఏను సభలో ఓడించి ప్రజల ముందు కాంగ్రెస్‌ పార్టీని దోషిగా నిలబెట్టాలని ఆతృతగా ఉన్నాయి.

bjpబీజేపీ కూడా అవిశ్వాస అస్త్రంతో కాంగ్రెస్‌ ను సాగనంపాలని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో హస్తం పార్టీని చిత్తుచేసిన కమలం పార్టీ…ఇప్పుడు పార్లమెంట్‌ వేధికగా స్తాచాటాలని భావిస్తోంది. అందుకోసం అవిశ్వాసాన్నే ఆయుధంగా చేసుకుని యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరికలు పంపింది. తెలంగాణ అంశంపై తప్ప మరే విషయంలోనైనా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తాము సిద్ధమంటూ సంకేతాలు పంపింది. అయితే సొంత పార్టీ నేతలే ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయామని చెపుతున్న పరిస్థితిల్లో సభ ముందు అవిశ్వాసం చర్చ వచ్చిన….ఓటింగ్‌ జరిగినా యుపీఏకు వ్యతిరేకంగా ఓటు వెయ్యాల్సిన పరిస్థితి బీజేపీ. ఇదిలా ఉంటే మత హింస నిరోధక బిల్లను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజేపీ దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వంపై నోకాన్ఫిడెంట్‌ మొషన్‌ మువ్‌ చేసే అవకాశం లేకపోలేదు.

అవిశ్వాసానికి ఎంపీల మద్ధతు పెరుగుతుండడంతో సభలో ఓటింగ్‌ జరిగే అవకాశం తీ కనిపిస్తోంది. దీంతో ఢిల్లీలో రాజకీయ వేడి రాజుకుంది. ఈక్రమంలో పార్టీల మద్ధతు కోసం సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు…టీడీపీ, జగన్‌ పార్టీ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల సపోర్టు కోసం లాబీయింగ్‌ చేస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలతో కూడా వీరు సంప్రదింపులు జరగుతున్న తెలుస్తోంది. ఇదిలా ఉంటే విభజనకు వ్యతిరేకంగా ఉన్న ములాయం, జయ, కరుణ. తృణమాల్‌ పార్టీలు ఖచ్చితంగా అవిశ్వాసానికి మద్ధతు ఇస్తామని తిరుబాటు ఎంపీలు భావిస్తున్నారు.

soniaఎవరి వాదన ఎలా ఉన్నా….కాంగ్రెస్‌కు మాత్రం జరగుతున్న పరిణామాలు మింగుడుపటడం లేదు. మెనార్టీ ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్‌ టీంకు ఇప్పుడేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఒకవైపు బుజ్జగింపులు చేస్తూనే …మరోవైపు మిత్రపక్షాల వేటలో ఉంది. అయితే నాలుగు రాష్ట్ర ఫలితాలు….స్కాం సర్కార్‌ గా అప్రతిష్ట …వద్దంటున్న ఒంటెద్దు నిర్ణయాల తో ఈసమావేశాల్లో కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతం దుకాణం బంద్‌ అన్నది మాత్రం ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.