కాంగ్రెస్ భయపడుతోంది : వెంకయ్య

venkaiah-naidu’టీ-బిల్లు’ సవరణలపై భాజాపా మరోసారి పట్టుపట్టింది. ముఖ్యంగా సీమాంధ్రకు ఆర్థిక ప్యాకేజీ, విభజన అనంతరం తొలి యేడాది సీమాంధ్రకు ఏర్పడే లోటు బడ్జెట్ ను కేంద్రమే భరించే విధంగా ఒత్తిడి తెస్తోంది. ఈ మేరకు భాజాపా సీనియర్ నేతలు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ.. తదితరులు కేంద్రంతో చర్చలు జరిపారు. అయితే, భాజాపా సూచించిన సవరణలకు కాంగ్రెస్ ఓకే చెబుతున్నప్పటికినీ.. వాటిని బిల్లులో సవరణ చేసేందుకు వెనుకాడుతోంది. బిల్లులో సవరణ చేసినట్లయితే.. బిల్లును మళ్లీ లోక్ సభకు పంపాలని కాంగ్రెస్ యోచిస్తోంది. అలా జరిగితే ఇబ్బందులు తలెత్తుతాయని హస్తం పార్టీ ఆలోచిస్తోంది. సవరణ అనంతరం లోక్ సభకు మళ్లీ టీ-బిల్లును తీసుకురావడానికి కాంగ్రెస్ భయపడుతోందని వెంకయ్య అంటున్నారు.