అధికార పార్టీ కార్యక్రమాలపై కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు . రోజూ ఏదో ఒక నిరసన కార్యక్రమంలో జనాల్లోకి వెలుతున్న హస్తం నేతలు అవకాశం దొరికినప్పుడల్లా అధికార పార్టీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. అటు ప్రభుత్వ పథకాలు, ఇటు మంత్రి హరీష్ రావుపై హసత్తం నేతలు నిప్పులు చెరిగారు. ఇప్పటికే కేసీఆర్ పాలనపై ప్రజలకు అసహనం మొదలైందంటున్నారు కాంగ్రెస్ నేతలు.
తోట పల్లి రిజర్వఆయర్ ను రద్దు చేయాల్సిందేనని మంత్రి హరీష్ రావు చేసిన కామెంట్స్ రెండు పార్టీ ల మధ్య చిచ్చుపెట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో ప్రారంభించిన ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ లోని అన్ని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి హరీష్ బహిరంగ చర్చకు సిద్దమా అని ప్రశ్నించారు మాజీ మంత్రి శ్రీదర్ బాబు. పాత ప్రాజెక్టులను పక్కన పెట్టాలనే కుట్రతో ప్రాణహిత చేవెళ్ళ లాంటి పెద్ద ప్రాజెక్టు ను పక్కన పెట్టడం బాధాకరమన్నారు.
గ్రామ జ్యోతి కార్యక్రమం ప్రజలను మభ్యపెట్టేందుకేనని హస్తం నేతలు విమర్శించారు. రాష్టంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీయం కేసీఆర్ కు వారి కుటుంబాలను పరామర్శించేందుకు కూడా సమయం లేదాని ప్రశ్నించారు. ఎన్నికల ముందిచ్చిన హామీలపై ప్రజలు నిలదీయవద్దనే రోజుకో కొత్త పథకం ప్రవేశపెడుతున్నారని నిప్పులు చెరిగారు. గ్రామ జ్యోతి పథకానికి ఎక్కడినుంచి నిధులు సేకరిస్తారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇప్పటి వరకు ప్రకటించిన పథకాలకు కావాల్సిన లక్షా ఇరవై వేల కో్ట్లు ఎక్కడి నుంచి తెస్తారో ఆర్ధిక శాక నుంచి వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో సర్కారు ప్రకటించిన మన ఊరు మన ప్రణాలిక కు గ్రామజ్యోతి పథకానఇకి తేడా ఏంటో చెప్పాలంటున్నారు. ఇప్పుడు ఆ పథకం ఉందో లేదో ప్రజలకు స్పష్ఠం చేయాలంటున్నారు. గతంలో సర్కారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పడేమయ్యాయని ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ చేస్తున్న ప్రకటనలు ఏవి ఆచరణ కు నోచుకోవటం లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు. నిర్ణయాలు తీసుకోవటం, వాటిని మద్యలోనే వదిలేయటం సర్కారు కు అలవాటుగా మారిందని ఫైర్ అవుతున్నారు హస్తం నేతలు.