​కర్ణాటక ఎన్నకల్లో కాంగ్రెస్ ఆధిక్యత

karnataka-pollsఅందరూ ఊహించినట్లే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఎన్నికలు నిర్వహించిన 223 స్థానాలకు గాను 109 చోట్ల ఆధిక్యత కనబరుస్తోంది. వీటిలో 9 స్థానాల్లో గెలుపు ఖాయమైంది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 40 స్థానాలలో ఆధిక్యంలో ఉండగా, ప్రతిపక్ష జెడిఎస్ 44 స్థానాల్లో ముందంజ లో వుంది . ఇక భాజపా నుంచి బయటకు  వచ్చి వీర హడావుడి చేసిన మాజా ముఖ్య మంత్రి యడ్యూరప్ప పార్టీ కేవలం 11 చోట్ల మాత్రమే ఆధిక్యంలో ఉండడం గమనార్హం . బీజేపీకి అర్ ఎస్ ఎస్ కి పట్టు ఉంటుందనుకున్న దక్షిణ కన్నడ జిల్లాల్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండడం విశేషం.