పోటాపోటీ భేటీలు

seemandra-leadersసమైక్య హీరోలుగా నిలవడానికి కాంగ్రెస్ నాయకులు పోటాపోటీ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ సీఎం కిరణ్ వ్యాఖ్యలు చేస్తే, రాజీనామా వార్తలతో పీసీసీ చీఫ్ బొత్స వార్తల్లో నిలిచారు. ఎవరి వర్గంతో వారు సమైక్యరాష్ట్ర పరిరక్షణకు ప్రణాళికలను సిద్దం చేసుకుంటున్నారు. సీమాంధ్ర మంత్రులు,ఎంపీలతో సీఎం కిరణ్ ఈ రోజు భేటీ అయ్యారు. సమైక్య నినాదంతో ఎలాంటి ప్రణాళికతో ప్రజల్లోకి వెళ్లాలనే దానిపై చర్చలు జరుపుతున్నారు. అంతే కాదు రాష్ట్ర పతిపాలనపైకూడా చర్చలు జరుపుతున్నారు. ఒక వేళ అధిష్టానం వెనక్కి తగ్గకపోతే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు తన వర్గంతో పీసీసీ చీఫ్ బొత్స భేటీ అయ్యారు. రాజీనామాలు చేసి ప్రజల్లోకి వెళ్లాలా లేక అధిష్టానాన్ని ధిక్కరించకుండా ముందుకు వెళ్లాలా అనేదానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద సమైక్య హీరోలుగా మిగలడానికి పోటాపోటీ భేటీలు నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి ఎవరిని ప్రజలు తమ హీరోగా అంగీకరిస్తారో చూడాలి మరి.