మార్చి నుంచి దేశంలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేకపోయినా.. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. దేశంలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఒక్కో గ్యాస్ సిలిండర్ రూ.1900 దాటాయి. అక్టోబర్ నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర పెరిగింది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో కూడా ధరల్లో పెరుగుదల కనిపించింది. అక్టోబరు నెలలో చెన్నై, కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర రూ.48 పెరిగింది. ఆ తర్వాత చెన్నైలో రూ.1903, కోల్‌కతాలో రూ.1850.50గా మారింది. మరోవైపు, ఢిల్లీ, ముంబైలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 48.5 పెరిగింది, రెండు మెట్రోలలో గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1740, రూ. 1692.50 గా మారింది. ప్రస్తుతం దేశంలోని నాలుగు మెట్రోలలో ముంబైలో చౌకైన వాణిజ్య గ్యాస్ సిలిండర్లు కనిపిస్తున్నాయి. అదే హైదరాబాద్‌లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1919 ఉంది.