Site icon TeluguMirchi.com

పవన్ పార్టీపై కామెంట్స్!!

jana-sena(1)’జనసేన పార్టీ’ పై పవన్ కళ్యాణ్ మరికొన్ని గంటల్లోఅధికారిక ప్రకటన చేయనున్న విషయం తెలిసిందే. పవన్ పార్టీపై ప్రముఖులు పలువిధాలు స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగబాబు తాను అన్నయ్య చిరంజీవి వెంటే అని క్లారిటీ ఇచ్చాడు. ఇక తెలంగాణ జాగృతి అద్యక్షురాలు కవిత పవన్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చేసిన తరువాతనే పార్టీ ప్రకటన చేయాలని కోరారు. తాజాగా, మరికొందరు పవన్ పార్టీపై తమ మనోగతాన్ని వెల్లడించారు.

సీపీఎం రాఘవులు : కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఎవరు వునా.. మేము వారిని స్వాగతిస్తాం. పవన్ ను మేము స్వాగతిస్తున్నాం.
పోసాని కృష్ణమురళి : నాయకులు మోసాలు చేసినప్పుడు ఎవరైనా.. వారిని ప్రశ్నించడం మంచిందే. డెమోక్రసీలో ఎవరైనా పార్టీలు పార్టీ పెట్టొచ్చు. పవన్ నీ స్వాగతిస్తున్నా.
మంచు మనోజ్ : మన పవర్ స్టార్ కి రాజకీయాల్లోకి స్టార్ కి స్వాగతం.. ఫుల్ పవర్ తో రావాలని కోరుకుంతున్నాను.

పవన్ ’జనసేన’పై ఇంకా పలువురు ముఖ్యలు స్పందించడానికి రెడీ వున్నట్లు తెలుస్తోంది. పవన్ మీడియా సమావేశం అనంతరం వీరంతా తమ మనోగతాన్ని వెల్లడించనున్నారు. పవన్ పార్టీ అప్ డేట్స్ పై బ్రౌజ్ చేస్తూనే వుండండి.. మీ తెలుగు మిర్చి డాట్ కామ్.

Exit mobile version