ఎప్పుడు వార్తల్లో ఉండే వరంగల్ కలెక్టర్ అమ్రాపాలి పెళ్లి కూతురు అయ్యారు. ఈమె వివాహం గురించి రెండు నెలలుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. జమ్ముకాశ్మీర్‌లో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో ఈమె వివాహం జరుగబోతుంది. పెళ్లి తంతు ప్రారంభం అయినట్లుగా అమ్రాపాలి పోస్ట్ చేసిన ఒక ఫొటోతో వెళ్లడైంది. అమ్రాపాలి ఆ ఫొటోతో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
కలెక్టర్‌గా ఇన్నాళ్లు హుందాగా కనిపించిన అమ్రాపాలి తాజాగా పెళ్లి కూతురు అయ్యి, చాలా పద్దతిగా లక్షణమైన అమ్మాయిగా కనిపిస్తుందని నెటిజన్‌లు అంటున్నారు. రేపు వీరి వివాహం వైభవంగా జరుగబోతుంది. ఇక వీరి వివాహ వింధును హైదరాబాద్ మరియు వరంగల్‌లో ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. ఈనెల 23న హైదరాబాద్‌లో నిర్వహించనుండగా, 25న వరంగల్‌లో నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈనెల 26న టర్కీకి హనీమూన్‌కు వెళ్లబోతున్నారు. మార్చి 7వ తారీకు వరకు అక్కడే ఉండబోతున్నారు. ఆమ్రపాలి వైరల్ ఫోటోను కింద చూడవచ్చు.