సీఎం.. సైడైపోయారు..??

kiranసీఎం కిరణ్ కుమార్ రెడ్డి సైలెంట్ గా సైడైపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ ఈరోజు (మంగళవారం) రాజీనామా చేయనున్నారనే నేపథ్యంలో.. రాష్ట్రంలో రాజకీయాలు మరింతగా వేడేక్కాయి. ఢిల్లీ పరిణామాలు, సీఎం రాజీనామాపై ప్రజలు ఎంతో ఉత్కంఠగా వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాజీనామా విషయంలో కిరణ్ వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. అయితే, అది తాత్కాళికంగా  మాత్రమేనని సమాచారం. రేపు (బుధవారం) ఉదయం 11గంటల సమయంలో.. ముఖ్యమంత్రి రాజీనామా చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. మరికొందరైతే.. సీం సైడైపోయారంటూ.. సైటర్లు వేస్తున్నారు. మరీ.. ఈ సైటైర్లు నిజమేనంటారా… !