సజ్జల రామకృష్ణ పై సిఎం జగన్ ఫైర్ !


రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ రద్దు చేసిన హైకోర్టు… రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. దింతో సహజంగానే ”జగన్ సర్కార్ కు షాక్” అంటూ ప్రతిపక్షాలు, మీడియా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపుతున్నాయి.

ఘనమైన విజయంతో ఘనంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్నతరుణంలో కోర్టు నుండి ఇలాంటి ప్రతికూల తీర్పు రావడం సిఎం జగన్ కు ఇబ్బందకరమైన వ్యవహారమే. ఐతే ఈ విషయంలో పూర్తి తప్పు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిదని పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

మొదటి నుండి ఈ విషయంలో జగన్ ని రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్ళారట సజ్జల. ప్రభుత్వ సలహాదారుగా ఉంటున్న సజ్జల.. పార్టీలో ఆధిపత్య పోరుకు తెరతీశారని, సిఎం జగన్ మెప్పు పొందే ప్రయత్నంలో లీగల్ విషయంలో కూడా తల దూర్చారని టాక్ వినిపించింది. పార్టీలో కొంతమంది పెద్దలు .. ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంలో సజ్జల సూచనలు పార్టీ, ప్రభుత్వ ప్రతిష్టకు దెబ్బతీసే ప్రమాదం ఉందని భావించారు. ఇప్పుడు అదే నిజమైయింది. ప్రభుత్వ ప్రతిష్టని దెబ్బ తీసేలా తీర్పు వచ్చింది.

ఈ తీర్పు సిఎం జగన్ ని అసహనానికి గురి చేసింది. పార్టీ వర్గాల ద్వార వచ్చిన కీలక సమాచారం ప్రకారం.. సిఎం జగన్.. ఈ తీర్పు వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పై తీవ్ర అసహనం వ్యక్తం చేసారని తెలిసింది. ”పార్టీలో కొంతమంది పెద్దలు చెప్పినా ఈ విషయంలో మీపై నమ్మకం ఉంచానని, అనవసరమైన ఆధిపత్యానికి పోయి పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేల చేయడం సరికాదని, ఇలాంటి తప్పుడు సలహాలని ఇకపై క్షమించేదిలేదని” సజ్జలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారట సిఎం జగన్.

ఏదేమైన సజ్జల సలహా .. జగన్ ప్రభుత్వం పై ఓ మచ్చతెచ్చి పెట్టింది. ఇకపై అయినా ఇలాంటి సలహాదారుల విషయంలో ప్రభుత్వ అధినేత జాగ్రత్తగా ఉండటం మంచిది.