కిరణ్ ఢిల్లీ పర్యటన రద్దు !

cm kiranముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రద్దయింది. ఈరోజు సాయంత్రం 8గంటలకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జీవోఎం ముందు హాజరుకావాల్సి వున్న విషయం తెలిసిందే. అయితే, ముఖ్యమంత్రితో భేటీని అధిష్టానం ఈనెల 18కి వాయిదా వేసింది. కిరణ్ జీవోఎంతో భేటీ వాయిదాపై ఎఐసీసీ ఓ ప్రకటన కూడా చేసింది.
కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత మనోజ్ తివారీ ముఖ్యమంత్రి పర్యటనను వాయిదా వేయాల్సిందిగా కోరినట్లు ఆ ప్రకటన పేర్కొంది. బాలల దినోత్సవంలో ముఖ్యమంత్రి తనతో పాటు కార్యక్రమంలో పాల్గొనాలనే తివారి ముఖ్యమంత్రి పర్యటన వాయిదా వేసుకోవాల్సిందిగా సూచించారని.. అందువల్లే కిరణ్ పర్యటన
వాయిదా పడినట్లు తెలుపింది. మరోవైపు, అధిష్టానం ముఖ్యమంత్రిని తొలగించేందుకే సిద్ధమైందని.. అందువల్లే కిరణ్ పర్యటనను వాయిదా వేసినట్లు ప్రచారం జరుగుతోంది. కిరణ్ విభజనకు సహకరించనని తేల్చిచెప్పిన నేపథ్యంలో.. జీవోఎంతో కిరణ్ భేటీ అనవసరమని, ఈ భేటీ వల్ల లేనిపోని సమస్యలు వచ్చిపడే
అవకాశం వుందన్నది వీరి వాదన. ఎవరివాదన ఎలా వున్నా.. కిరణ్ పై అధిష్టానం కాస్త గుర్రుగానే వుందన్నది మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది. మొత్తానికి కిరణ్ భవితవ్యం, విభజనపై క్లారిటీ ఈ నెల 20తేదీ తరవాతే రానున్నట్లు తెలుస్తోంది.