Site icon TeluguMirchi.com

CM Revanth Reddy : ఏపీ సీఎం చంద్రబాబుతో పోటీపడే అవకాశం నాకు వచ్చింది : సీఎం రేవంత్‌రెడ్డి


ఈరోజు జరిగిన బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి 24 వ వార్షికోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రి లక్షలాది మందికి సేవలందిస్తోందని తెలిపారు. అంతేకాదు ఏపీ సీఎం చంద్రబాబుతో అభివృద్ధిలో పోటీపడే అవకాశం నాకు వచ్చింది. ఆయన 18 గంటలు పనిచేసి.. నేను 12 గంటలు పని చేస్తే సరిపోదు. తెలంగాణ రాష్ట్ర నేతలు, అధికారులు కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధిలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి.. ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Kalki Release Trailer : ‘కల్కి’ ట్రైలర్.. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాడుగా !

ఇక బసవతారకం ఆసుపత్రి ఛైర్మన్‌, మేనేజింగ్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. క్యాన్సర్‌ మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తున్నది అన్నారు. అలాగే ఆస్పత్రి సేవల కోసం సీఎం రేవంత్‌రెడ్డి సహకారం కోరగానే వెంటనే ఆయన అంగీకరించినట్టు తెలిపారు. దాతల సహకారంతో ఆస్పత్రి ఈ స్థాయికి చేరుకున్నదని, ఈ సేవలను మరింతగా విస్తరించాలని బాలకృష్ణ చెప్పారు.

Exit mobile version