Site icon TeluguMirchi.com

లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్


తెలంగాణ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం గ్రామాల ప్రజలకు ఊరట కలిగించింది. లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల ప్రజల ఆందోళనలను గమనించిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఆయా గ్రామాల ప్రజలు ఫార్మా కంపెనీల కంటే ఇతర పరిశ్రమల కోసం భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు. పర్యావరణానికి ముప్పు ఉండకూడదనే ఉద్దేశంతో, పరిశ్రమల ఏర్పాటుకు స్వచ్ఛందంగా సహకరించాలని వారు ఆశీర్వదించారు.

ఇందుకు అనుగుణంగా, ప్రభుత్వం త్వరలో ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో కొత్త నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పార్క్‌లో టెక్స్‌టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇది పొల్యూషన్ లేని పరిశ్రమలుగా ఉండటంతో పాటు, స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. టెక్స్‌టైల్ పరిశ్రమల ద్వారా గ్రామాల ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది సహాయపడుతుంది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు మాత్రమే కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి కూడా కీలకమైన ముందడుగుగా భావిస్తున్నారు. పర్యావరణహిత పరిశ్రమలతో పాటు, గ్రామాలకు అవసరమైన సహకారాన్ని అందించాలన్న ప్రభుత్వ ఆలోచన అభినందనీయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version