Site icon TeluguMirchi.com

’కన్నా’కు సీఎం ఆఫర్… ?

Kanna-Lakshmi-Narayana1రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం వేగంగా దూసుకెళ్తుతోంది. విభజన గట్టిగా వ్యతిరేకించిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలను తన దారిలోకి కూడా తెచ్చుకుంది. అప్పుడు అడ్డుపడతాం.. అన్నవారే ఇప్పుడు బెస్ట్ ప్యాకీజీలు కావాలనే నివేదికలతో అధిష్టానం ముందుకు వెళుతున్నారు. అలా.. అందరిని దారిలోకి తెచ్చుకున్న అధిష్టానానికి ముఖ్యమంత్రి కిరణ్ మాత్రం కొరకరాని కొయ్యలా తయారయ్యారు. కిరణ్ దారికొచ్చాడు.. అంటే అది.. అధిష్టానం అభిప్రాయం కావొచ్చని బహిరంగంగా చెప్పేస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. అధిష్టానం సీఎంను సీటును మరో నేతకు కట్టుబెట్టాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మొదట కిరణ్ స్థానంలో కోట్లను కూర్చోబెట్టడానికి అధిష్టానం ప్రయత్నించినప్పటికినీ.. అవి ఫలించనట్లు తెలుస్తోంది. కోట్ల సీఎం ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడట. ఢిగ్గీరాజా డిన్నర్ కు ఆహ్వానించి మరీ నచ్చచెప్పిన కోట్ల కరగలేదని తెలుస్తోంది. దీంతో.. సీఎం ఆఫర్ కోట్ల నుంచి కన్నాకు షిఫ్ట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. గతకొద్దికాలంగా కన్నా.. నేరుగా అధినేత్రి సోనియాగాంధీతో సమావేశమయి నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కన్నాకు అధిష్టానం నుంచి కబరు వచ్చింది. దీంతో.. గుంటూరు రచ్చబండ కార్యక్రమంలో వున్న కన్నా.. హుఠాహుఠిన హస్తిన పయనమవుతున్నారు. కన్నాకు పరిస్థితులు వివరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిని చేయాలన్న అధిష్టానం ప్లాన్ గా తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి ఆఫర్ ని కన్నా అయినా.. స్వీకరిస్తాడో.. లేదో చూడాలి. కన్నా ఆఫర్ ని స్వీకరించనట్లయితే.. సీఎం ఆఫర్ చెయిన్ కాస్త.. కోట్ల.. కన్నా……. ఇలా మరికాస్త పెగిగే అవకాశం వున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version