వచ్చే నెలలో కిరణ్ కొత్త పార్టీ.. ?

devineni-umaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్తపార్టీ పెట్టబోతున్నారని తెదేపా ఎమ్మెల్యే దేవినేని ఉమ జోస్యం చెప్పారు. సీమాంద్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఎఐసిసి అదినేత్రి సోనియాగాందీ డైరెక్షన్ లోనే నడుస్తున్నారని ఉమ ఆరోపించారు. ఇటీవల కాలంలో సీఎం కొత్త పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. మరీ సీఎం నిజంగానే అధిష్టానాన్ని ధిక్కరించి కొత్త పార్టీకి పురుడుపోస్తాడా.. ? లేదా అధిష్టానం ఆజ్జతో విభజనకు సహకరిస్తాడా.. ? అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా.. సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్ గా ముద్రపడిన సీఎం కిరణ్ ఇప్పుడు సమైక్య వాదులకు ఆశాకిరణంగా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎలాగూ ఏపీ ఎన్జీవోలు సమ్మెను విరమిస్తే.. సమైక్య ఉద్యమ వేడి దాదాపు తగ్గే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో.. సీఎం నయా పార్టీని నెలకొల్పే అవకాశాలు కూడా లేకపోవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏమో చూద్దాం.. సీఎం సీను ఎలా వుండబోతోందో.. !