కిరణ్ కొత్త పార్టీ ఖరారు.. 15 లక్షల టీ షర్ట్ లకు ఆర్డర్

kiranసీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి. ఈ వార్త పై ఈ రోజు మరింత క్లారీటి వచ్చింది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కిరణ్ కొత్త పార్టీ ఖారారు అయినట్లు తెలుస్తోంది.ఇప్పటికే పార్టీ నిర్మాణానికి కావాల్సిన పనులను సీఎం వర్గీయులు పూర్తి చేస్తున్నారు. పార్టీ పేరు సమైక్యాంధ్ర పేరు వచ్చే విధంగా పార్టీ ఉండే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. జనవరి 23న కిరణ్ కొత్త పార్టీని ప్రకటించే అవకాసం వున్నట్లు తెలుస్తోంది. పాలనదక్షకుడిగా తనను జనం నమ్ముతారన్న భావనలో కిరణ్ కొత్త పార్టీ వైపు అడుగులేస్తున్నారు.

ఇక కిరణ్ కొత్త పార్టీ స్క్రిప్ట్ రచనలో రాజమండ్రి ఎంపీ ఉండవల్లి బిజీబిజీగా ఉన్నరని వినిపిస్తోంది. విజయవాడ ఎంపీ లగడపాటి నేతృత్వంలో సర్వేలు జరుగుతున్నాయని బోగట్టా. కిరణ్ సోదరుడు జుబ్లీ హిల్స్ లో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ లోగోలుతో కూడిన 15 లక్షల టీ షర్ట్ లకు ఆర్డర్ ఇచ్చినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.

సీ. ఎం కొత్త పార్టీ కి సంభందించిన పూర్తి వివరాల కోసం బ్రౌజ్ చేస్తూనే వుండండి తెలుగుమిర్చి డాట్ కామ్