Site icon TeluguMirchi.com

రాహుల్ తో సీఎం భేటీ !

cm-krian-delhi-tourముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో వరుసగా కాంగ్రెస్ పెద్దల భేటీతో.. బిజీబిజీగా ఉన్నారు. సీఎం కిరణ్ ఈరోజు (సోమవారం) ఉదయం కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ర్టం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై సీఎం రాహుల్ గాంధీకి నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ర్టంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం సీఎం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాలు  పాటుసాగిన ఈ భేటీలో రాష్ర్టంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

కాగా, ఆదివారం సీఎం కిరణ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్, కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్తో సమావేశం అయిన విషయం తెలిసిందే. విద్యుత్ ఛార్జీల పెంపు నేపథ్యంలో.. ప్రతిపక్ష నేతల ఆందోళనలు, ధర్నాలు, దీక్షలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చార్జీలు ఎందుకు పెంచాల్సివచ్చిందో అజాద్కు సీఎం కిరణ్ వివరణ ఇచ్చారు. కొత్తగా నిర్మిస్తున్న గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు శంకర్పల్లి, నేదునూరులకు గ్యాస్ కేటాయిస్తే, సమస్య పరిష్కారం అవుతుందని అజాద్ను సీఎం కోరారని తెలుస్తోంది.

Exit mobile version