ఎటూ తేల్చని.. అఖిలపక్షం !

kiran-kumar-reddyబాబ్లీ ప్రాజెక్టుపై చర్చించడానికి కిరణ్ ప్రభుత్వం ఈరోజు (గురువారం) అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. అయితే అఖిలపక్ష నేతలందరినీ ఢిల్లీకి తీసుకువెళతామని ఈ సమావేశంలో సీఎం హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల సూచనలపై న్యాయపరమైన సలహాలు తీసుకొని మరోసారి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిన తరవాత బాబ్లీపై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. బాబ్లీపై సుప్రీంకోర్టులో ప్రభుత్వం పేలవమైన వాదనలతో కొత్త చిక్కులు వచ్చే అవకాశం ఉందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ ఎడారిగా మారుతుందని కొన్ని పక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో… సుప్రీంతీర్పుపై సమీక్ష పిటిషన్ వేయాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే గత మూడు రోజుల క్రితమే అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సి ఉన్నా.. సీఎం అందుబాటులో లేకపోవడంతో టీడీపీ నాయకులు ఆ అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన విషయం తెలిసిందే.