సీఎం.. క్రేజివాల్.. !!

cm krejiwal

ఢిల్లీ పీఠంపై ఏర్పడిన ఉత్కంఠ మరికొద్దిసేపట్లో తెరపడనుంది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ‘ఆమ్ ఆద్మీ’ ముందుకొంచింది. మరికొద్ది సేపట్లో ఆ పార్టీ కన్వీనర్ క్రేజివాల్ గవర్నర్ నజీబ్ జంగ్ ను కలవనున్నారు. అయితే, ముఖ్యమంత్రిగా క్రేజివాల్ ఎన్నికయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఈరోజు (సోమవారం) ఉదయం కానిస్టిట్యూషన్ క్లబ్ లో  సమావేశమయిన ఆ పార్టీ శాసనసభ పక్షం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

పార్టీని స్థాపించి యేడాది కూడా గడవకముందే.. ’ఆమ్ ఆద్మీ పార్టీ’ అధికార పీఠాన్ని దక్కించుకోవడం విశేషం. అవినీతిపై ఢిల్లీ గల్లీల్లో పోరాటాలు చేసిన క్రేజివాల్ ను.. ఇక మీదట.. సీఎం క్రేజివాల్ అని పిలవాలన్న మాట. ఆల్ ది బెస్ట్ ఫర్.. సీఎం క్రేజివాల్.