ఆయన ఫ్లవర్ పెడితే.. మేం.. క్యాలిప్లవర్ పెడతాం.. !

cm kiran vs ysrcpరాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ’ప్రజల చెవుల్లో పూలు’ పెడుతున్నాడు అంటున్నారు వైకాపా నేతలు. దీనికి నిరసనగా నేడు వైకాపా ఎమ్మెల్యేలు.. నల్లటి దుస్తులు, చేతిలో క్యాలిప్లవర్లతో శాసనసభకు వచ్చి విన్నూతన రీతిలో నిరసన తెలియజేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా వుంచుతానంటూ.. తెర వెనక ముఖ్యమంత్రి విభజనకు సహకరిస్తున్నారన్నది వీరి వాదన.

ముఖ్యమంత్రి వర్గం దీన్ని పూర్తిగా తిప్పికొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ప్రజల చెవ్వుల్లో పూలు పెడతున్నారో.. లేదో తెలియదు కానీ, వైకాపా అధినేత జగన్ మాత్రం ప్రజల చెవుల్లో ఏకంగా క్యాలిఫవర్ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అందుకే.. వారి ఎమ్మెల్యేలను ’క్యాలిఫవర్’ తో శాసనసభకు పంపించారని ఎద్దేవా చేస్తున్నారు. అదేంటీ.. అంటే.. లోక్ సభలో అవిశ్వాసం పెట్టిన వైకాపా.. దానిపై చర్చకు తెరలేచే సమయంలో అవిశ్వాసాన్ని వెనక్కు తీసుకున్న సంఘటనను ఉదహరిస్తున్నారు. నిజానికి నిస్సుగ్గులేకుండా సహకరించే పార్టీ ఏదైనా వుందా.. ? అంటే అదీ.. వైకాపానే అన్నది ముఖ్యమంత్రి వర్గం వారి వాదన.

ఎవరి వాదన ఎలా వున్నా అందరూ..  ఆ సూది సందు దారం వారే. ఎవరికి వారే పోటీ పడి ప్రజలో పూలు, క్యాలీఫవర్లు పెట్టడానికి పోటీపడుతున్నారని రాజకీయ విశ్లేషకుల వాదన. ఒక్క పార్టీ అంటే.. ఒక్కపార్టీ కూడా ప్రజలకు చెబుతున్న దానికి చేస్తున్న దానికి సంబంధం లేదన్నది వీరి అభిప్రాయం.

ఏ నేతలకే చెవులో పూలు పెట్టడం వస్తుందా.. ? ప్రజలకు తెలియదా.. ? అనే కదా.. మీ డౌటు. వాళ్లు రెడీగా వున్నారండీ బాబు.. ఎన్నికల్లో నేతల చెవుల్లో పెద్ద పూవు పెట్టడానికి. ప్రశాంతంగా వున్నంత వరకే ప్రజలు. ఒక్కసారి రెచ్చపోయారో.. ఇక రాజకీయ నేతల ఖేల్ ఖతం.  పొలిటీషన్స్.. జర  జాగ్రత్త.. !