Site icon TeluguMirchi.com

” పక్కవాడిని తోక్కేయకండి ”

cm-meetingహైదరాబాద్ లోని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి విస్తృత కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంతి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలలో ఉత్సాహన్ని నింపే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నేతలను, కార్యకర్తలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ, వారికి కర్తవ్యబోధ చేశారు. 2014 ఎన్నికలే లక్ష్యమంటూ వారిలో ఉత్సాహన్ని నింపే ప్రయత్నం చేశారు. కార్యకర్తల శ్రమవల్లే తాము పదవుల్లో ఉన్నామని చెబుతూ, కార్యకర్తను మరిచిన వాళ్ళు మరలా ఎమ్మెల్యే కాలేరని హెచ్చరించారు. కార్యకర్తలకూ అవకాశం రావాలంటే శ్రమించడమొక్కటే మార్గమని కిరణ్ సలహా ఇచ్చారు. పోటీగా ఉన్నాడని సహచరులను తొక్కేయడానికి ప్రయత్నిస్తే అంతిమంగా అది పార్టీకే నష్టమని పేర్కొన్నారు. ఎవరి తలరాత ఎవరి చేతుల్లో లేదంటూ, కష్టపడితే అవకాశం వెతుక్కుంటూ వచ్చి తలుపుతడుతుందని చెప్పారు.

Exit mobile version