సీఎం రాజీనామా..??

cm-kiran5ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్లమెంట్ లో టీ-బిల్లును ప్రవేశపెట్టిన వెంటన కిరణ్ పదవి నుంచి వైదొలుగుతారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ నుంచి వచ్చిన అనంతరం పలువురు మంత్రుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.

మరోవైపు, కాంగ్రెస్ అధిష్టానం కూడా ముఖ్యమంత్రిపై సీరియస్ గా వుంది. రాజ్యసభ ఎన్నికల తరవాత సీఎంపై సీరియస్ యాక్షన్ కు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ఇటీవల టీ-నేతల వద్ద రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ముఖ్యమంత్రి కిరణ్ పై ఫిర్యాదు చేసిన టీ-నేతలతో ఢిగ్గీరాజా..  రాజ్యసభ ఎన్నికల వరకు వేచి చూడండి.. ఆ తరవాత ఏం జరుగుతుందో మీరే చూస్తారు కదా.. ! అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మొత్తానికి ఇటు సీఎం కిరణ్, అటు కాంగ్రెస్ అధిష్టానం ఎవరి పంతాలో వారు వున్నారు. మరీ.. సీఎం రాజీనామా చేసే దాక అధిష్టానం వేచి చూస్తుందా.. ? లేదా.. ఆయన రాజీనామకు ముందే చర్యలు గైకొంటుందా.. ? అనేది వేచి చూడాలి. ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. అదే సీఎం మార్పు.  అదీ.. ముఖ్యమంత్రి రాజీనామా ద్వారానా.. ? లేక అధిష్టానం చర్యల వలనా.. ? అనేది తెలియాల్సి వుంది.