శక్తిస్థల్ లో సీఎం మౌనదీక్ష..!!

cm kiranవిభజన బిల్లుపై శాసనసభ నివేదిక ఢిల్లీ చేరనుండటంతో… నేతలు కూడా తమ ప్రణాళికలను హస్తినాలో అప్లైయ్ చేయడానికి రెడీ అయిపోయారు. రేపు (మంగళవారం) సీమాంధ్ర నేతలు శక్తిస్థల్ వద్ద మౌనదీక్షకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నేతలు ఈరోజే ఢిల్లీ బాటపట్టనున్నారు. ఈ దీక్షకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నాయకత్వం వహించే అవకాశం వున్నట్లు సమాచారం.

దీక్షలో పాల్గొనడానికి పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రులు సి. రామచంద్రయ్య, కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రాంనాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, డొక్కా.. తదితరులు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సొంత ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేయడానికి సీమాంధ్ర నేతలు రెడీ కావడంతో.. ఢిల్లీలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కే అవకాశం వుంది. మరోవైపు, టీ-నేతలు సైతం హస్తినా చేరి ’టీ’కి మద్దతుగా వారి వారి ప్రయత్నాలు సాగించడానికి రెడీ అయిపోయారు. దీంతో.. హస్తినా ఏపీ పాలిటిక్స్ తో మరోసారి హీటెక్కనుంది.