పదవి పోయినా పర్లేదట !

cm kiranరాష్ట్ర విభజనను ఆపాలని సాయశక్తుల ప్రయత్నించిన వారిలో మొదటి వ్యక్తి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ సమైక్యాంధ్ర స్టార్ బాట్స్మెన్ విభజన వద్దంటున్నా… ప్రజలకు, పార్టీకీ మేలు చేయదంటున్నా అధిష్టానం ఏమాత్రం పట్టించుకోలేదు. ఎన్ని ప్రపోజల్స్ తో అధిష్టానం ముందు ప్రజెంటేషన్ ఇచ్చిన లాభం లేకపోయింది. పైగా రాష్ట్ర విభజన మీ చేతుల మీదుగా జరగాలని అధినేత్రి ఆదేశించింది. దీంతో.. ఈ సమైక్యాంధ్ర స్టార్ బ్యాడ్స్ మెన్ కాస్త రిటైర్డ్ హార్డ్ కాక తప్పలేదు. రాష్ట్ర విభజనపై అధిష్టానం ప్రకటన చేసినప్పటి నుంచి కూడా కిరణ్ బయటకు రావడం లేదు.. సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి మాత్రమే పర్యవేక్షిస్తున్నారు.

తాజాగా, ఈ ఘోరమైన వ్యవహారం (రాష్ట్ర విభజన) నా చేతుల మీదుగా నడిపించేందుకు సిద్ధంగా లేను. నా శక్తిమేరకు ఎదుర్కొంటాను. ఈ దశలో నా పదవి పోయినా ఫర్వాలేదు” అని కిరణ్ తేల్చిచెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తనను కలిసినప్పుడు సమావేశ ముగింపు దశలో ఒక సీనియర్ నేతతో ఇదే విషయం పునరుద్ఘాటించినట్లు సమాచారం.

తెలంగాణపై తీర్మాణం అసెంబ్లీలో వీగపోయే అవకాశం ఉన్నట్లు సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో తీర్మాణం వీగిపోయినట్లయితే.. విభజన మరింత ఆలస్యం కావచ్చని.. వీలైతే మరోసారి ఫామ్ లోకి వచ్చైనా.. రాష్ట్ర విభజనను అడ్డుకోవలని సీఎం కిరణ్ భావిస్తున్నట్లు సమాచారం.