ధర్మాన, మోపిదేవి కేసులు వేరు వేరు : ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి ధర్మాన ప్రసాదరావు, మోపిదేవి వెంటకరమణల వ్యవహారాలు వేర్వేరు అని అన్నారు. సీబీఐ మోపిదేవిని అరెస్ట్‌ చేసిందని.. కానీ ధర్మానపై విచారణకు సీబీఐ సర్కారు అనుమతి కోరిందని సీఎం వివరించారు. శుక్రవారం మీడియాతో రాష్ట్రంలోని పలు అంశాలపై మాట్లాడిన ముఖ్యమంత్రి కేబినెట్ నియామకాలకు కట్టుబడని మంత్రులను తొలగించవచ్చని కూడా అన్నారు. మద్యం ధరల పెంపును ఆమోదించిన ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రాజీనామాపై స్పందించనని..తనకు ఆయన సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ ని రాబోయే నెల రోజుల్లోగా పూర్తి చేయనున్నట్టు తెలిపారు. త్వరలో సోనియా రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని కిరణ్ వెల్లడించారు.