ఢిల్లీకి సీఎం.. ?

cm kiranముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. ఎల్లుండి ఢిల్లీలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరుకావాలంటూ.. ముఖ్యమంత్రిని అధిష్టానం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. చాలా రోజుల తరవాత ముఖ్యమంత్రి మరోసారి హస్తిన వెళ్లనున్నారు. అయితే, మంత్రుల బృందం (జీవోఎం)కు నివేదించిన అంశాలుపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం వున్నట్లు సమాచారం. అధిష్టానంపై ధిక్కారణ ధోరణిని వినిపించిన కిరణ్ ను.. అధిష్టానం కూడా గత కొద్దికాలంగా దూరంగా పెడుతూ వచ్చింది. చాలాకాలం నుంచి కిరణ్ హస్తినాకు వెళ్లకపోవడమే ఇందుకు ఊదాహరణగా చెప్పొచ్చు.  మరీ ఇప్పుడు పరిస్థితులు మారాయా.. ? విభజన విషయంలో.. సహకరిస్తానన్న సంకేతాలను సీఎం ఏమైనా.. అధిష్టానానికి పాస్ చేశారా.. ? అనే సందేహాలు రాక మానవు. మొత్తానికి కిరణ్ పై పెద్ద ప్లానే అప్లై చేసినట్లు కనిపిస్తోంది. అందుకే కిరణ్ కరిగిపోయారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.