తెలంగాణ బొగ్గు సీమాంధ్ర వాడుకోవడం లేదు:సీఎం

kiranతెలంగాణలో ఉత్పత్తయ్యే బొగ్గును సీమాంధ్రులు వాడుకుంటున్నారన్నది అవాస్తవమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి నుంచి ఆంధ్రాకు ఒక టన్ను బొగ్గు కూడా కేటాయించలేదని , తమ బొగ్గు సీమాంధ్రకు తరలిస్తున్నారని పదేపదే ఆరోపణలు చేయడం తప్పని, సింగరేణి బొగ్గు కేటాయింపులు రాష్ట్ర ప్రభుత్వం చేయదని, కేంద్రం చేస్తుందని సీఎం తెలిపారు. సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు కేటాయిస్తోందని, ఆంధ్రా ప్రాంతానికి చేయలేదని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సభలో సభ్యులనుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. టీఆర్ఎస్ సభ్యులు ఆయన ప్రసంగానికి పదేపదే అడ్డు తగిలారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ పదేపదే కోరినప్పటికీ వారు వినలేదు. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి, మీరు ఇలాగా ప్రవర్తిస్తే నాకు వచ్చిన సమస్య ఏమీ లేదు, గడువు మరో వారంపాటు పెంచారు, నా చర్చను రేపైనా కొనసాగిస్తాను అంటూ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.