Site icon TeluguMirchi.com

సమ్మెను విరమించండి

cm-kiran-kumar-reddyసమ్మె విరమించాలని ఏపీఎన్జీవోలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఏపీ ఎన్జీవోల సమ్మెపై ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అత్యవసర సేవలకు విఘాతం కలిగించవద్దని ఏపీఎన్జీవోలను, సమ్మె చేస్తున్నవారిని కోరారు. ప్రజాజీవనంపై సమ్మె విపరీత ప్రభావం చూపిస్తున్నందున సమ్మె విరమించాలని ఏపీ ఎన్జీవోలను ముఖ్యమంత్రి కోరారు. మరోవైపు, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా ఎపీ ఎన్జీవోలకు ఇదే విజ్ఞప్తి చేశారు. 40రోజులకు పైగా ఏపీ ఎన్జీవోలు సమ్మే చేస్తున్నప్పటికీ.. ఏ రోజు కూడా వారిని సమ్మెను విరమించాలని ముఖ్యమంత్రి గానీ, పీసీసీ అధ్యక్షుడు గానీ కోరిన దాఖలాలు లేవు. తాజాగా, వీరి చేసిన విజ్ఞప్తులకు కారణం అధినేత్రి సోనియా విదేశాల నుంచి తిరిగి రావడమేనని రాజకీయనేతలు గుసగుసలాడుతున్నారు. కాగా, ఏపీ ఎన్జీవోలు మాత్రం సమైక్యంపై ప్రకటన వచ్చే వరకు సమ్మెను కొనసాగిస్తామని.. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.

Exit mobile version