Site icon TeluguMirchi.com

అధిష్టానంతో ఇంకా గట్టిగా మాట్లాడా : సిఎం

cm-kiranఈ మూడేళ్ళ కాలంలో తనకు సహకరరించిన సహచరులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి. ముఖ్యమంత్రిగా మూడేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ఆయన…హైదరాబాద్ లోని సీఎం క్యాంపు ఆఫీసులో పలు విషయాలపై మీడియాతో మాట్లాడారు. మూడు సంవత్సరాలపాటు తనను ముఖ్యమంత్రిగా ఆదరించినందుకు ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఈ మూడేళ్ల కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని సంక్షేమ కార్యక్రమాలను అందించగలిగామని అన్నారు. రూ. 9 వేల కోట్లను సంక్షేమ పథకాల కోసం కేటాయించామని అన్నారు.

ప్రకృతి విపత్తుల వల్ల రైతులు చాలా నష్టపోయారని, వారికి ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాలను అందించామని చెప్పారు. వడ్డీని ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. రైతులకు ఈ ఏడాది రూ. 1260 కోట్ల వడ్డీలేని రుణాలను అందించామని చెప్పారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా సంక్షేమం విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తేలేదని అన్నారు. విద్యా రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చామని… యువతకు ఉపాధి అవకాశాలు పెంచామని తెలిపారు. అనేక సమస్యలున్నా పారిశ్రామిక రంగంలో పురోభివృద్ధి సాధించామని సీఎం అన్నారు. విద్యుత్ ఉత్పాదనలో కొంత వెనకబడ్డ విషయం నిజమేనని… కేంద్రం నుంచి రావాల్సిన గ్యాస్ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధిష్ఠానంతో ఇంకా గట్టిగానే మాట్లాడా:

విభజన అంశం లో మీకు చెప్పినవన్నీ 25 శాతమే… అంతకన్నా ఎక్కువగా, గట్టిగా అధిష్ఠానంతో మాట్లాడామని తెలిపారు. విభజనపై అధిష్ఠానం మనసు మార్చుకునేలా చాలా ఒత్తిడి తీసుకొస్తున్నామని అన్నారు. విభజన విషయంలో ఏం చేస్తున్నానో రోజూ మీరే చూస్తున్నారని మీడియాను ఉద్దేశించి అన్నారు. ఇప్పుడున్న దానికంటే మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందనుకుంటే… రాష్ట్ర విభజన గురించి ఆలోచించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం కలిసుండాలనే ఇప్పటికీ కోరుకుంటున్నానని సీఎం తెలిపారు. విభజన వల్ల రెండు రాష్ట్రాలకు మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని అన్నారు.

ప్రోరోగ్ కు అంత సీన్ లేదు:

అసెంబ్లీ ప్రోరోగ్ అంశం పై మాట్లాడుతూ… అసెంబ్లీ ప్రోరోగ్ ఒక సాంకేతిక సమస్యేనని… దానికంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి కిరణ్ తెలిపారు. పార్టీనా, సమైక్యమా తేల్చుకోవాల్సిన పరిస్థితి శత్రువుకు కూడా రాకూడదని అన్నారు. ఇందిర చెప్పిన విషయాలను అధిష్ఠానానికి వివరించామని సీఎం తెలిపారు.

Exit mobile version