Site icon TeluguMirchi.com

‘అమ్మ హస్తం‘ ప్రారంభం !

amma-hasathamశ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ‘అమ్మ హస్తం’ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాకు చేరుకున్న సీఎం కిరణ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు, కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలు ఘన స్వాగతం పలికారు. అయితే సీఎం పర్యటనలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. మంత్రి ధర్మాన ప్రసాద రావు కాన్వాయ్‌ లో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో స్థానిక కాంగ్రెసు మహిళా నేత మోహినికి స్వల్ప గాయాలయైనట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. మరోవైపు సీఎం జిల్లా పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అచ్చెన్నాయుడిని పోలీసులు నిమ్మాడలో గృహ నిర్బంధం చేశారు. సీఎం కిరణ్ పర్యటనను అడ్డుకోవడానకి టిడిపి నేతలు సిద్ధం కావడంతో.. పలు ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

 

 

Exit mobile version