సిఎం సిక్సర్ కొట్టారట !

lagadapatiసిఎం కిరణ్ కుమార్ రెడ్డి సిక్సర్ కొట్టారని.. ఇంకా బ్యాటింగ్ కొనసాగిస్తూనే ఉన్నారని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ అన్నారు. స్పీకర్ పై అనవసరమైన ఆరోపణలు మోపారని అన్నారు. హైదరాబాద్ లో మాట్లాడిన ఆయన .. బిల్లును సీమాంధ్ర నేతలు, ప్రజలు ఎందుకు వ్యతిరేకించారో కేంద్రం గుర్తించాలని సూచించారు. ఐదేళ్ల ఉద్యమ కాలంలో లక్షలాది ఉద్యోగాలు కోల్పోయామని అన్నారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో దత్తపుత్రుడు, వేర్పాటు పుత్రులతో అవగాహనకు వచ్చి కాంగ్రెస్ ఇలా చేసిందని అన్నారు. ఫిబ్రవరి 21 పార్లమెంటుకు చివరి రోజని… ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. మనది నియంతల దేశం కాదని, ప్రజాస్వామ్య దేశమని… మరో మూడు వారాల్లో ఈ విషయం నిరూపితమవుతుందని చెప్పుకొచ్చారు.