సీఎం ఫ్యూచర్ బండ !

CM-Kiran-Kumar-Reddyవిభజనపై కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ.. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ పని మొదలెట్టినా.. అది హాట్ టాపిక్ గా నిలుస్తోంది. రాష్ట్ర విభజన విషయంలో.. అధిష్టానానికి ధిక్కార స్వరాన్నివినిపించి.. ఓ రకంగా సీమాంధ్ర ప్రాంతంలో సీఎం ఓ రేంజ్ లో ఇమేజ్ ని సంపాందించుకున్నారనే చెప్పాలి. విభజనవైపు అధిష్టానం అడుగులు వేసిన ప్రతిసారి.. ఆ అడుగులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాదు.. అధిష్టానం నిర్ణయం వల్ల సీమాంధ్రలకు వాటిల్లే లాభనష్టాలను కర్రపట్టి మరీ ఏకరువుపెట్టారు. తన, మన అన్న ప్రతివారితో ఆ విధంగా చెప్పించారు కూడా. చివరకు ఏపీ ఏన్జీవోల ఉద్యమానికి ఊతమించారనే ఆరోపణలు కూడా విపరీతంగా వచ్చాయి. అయినప్పటికినీ.. అధిష్టానం అడుగులు విభజన వైపు వడివడిగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. సీఎం కిరణ్‌ నెక్ట్స్‌ స్టెప్‌ ఎలా ఉండబోతోంది..? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

విభజనను ఆపే మార్గాలను అన్వేశించడం మానేసి ముఖ్యమంత్రి తన ఫ్యూచర్ ఫ్లాన్ ను ఇంప్లిమెంట్ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అందుకే.. విభజన వేళ సీఎం రచ్చబండ వైపు ఎందుకు దృష్టి సారించారని విశ్లేషకుల మాట. అందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ప్రజల్లోనే ఉండటం ద్వారా.. తన ఫ్యూచర్‌కు ఎలాంటి ఢోకా లేదంటూ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ సమైక్య స్టార్ బ్యాట్స్ మెన్. మరి సీఎం చేస్తున్న సైలెంట్ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది.. ? రచ్చబండా ద్వారా కాంగ్రెస్ కార్యక్రమాలను ప్రజాల్లోకి తీసుకెళ్తరా.. ? లేక తన వ్యూచర్ రాజకీయ జెండాను ప్రజల ముందు ఆవిష్కరిస్తారా.. ? వేచి చూడాలి. అయితే, ఏవిధంగా చూసిన రచ్చబండ సీఎంకు కలిసొచ్చేలా కనబడుతోంది.. వర్కవుట్ అయితే కాంగ్రెస్ రచ్చబండ.. లేకపోతే.. కిరణ్ వ్యూచర్ బండ…