Site icon TeluguMirchi.com

టీ-బిల్లుపై చర్చ ముగిశాకే.. ?

cm kiranవిభజన ముసాయిదాపై అసెంబ్లీలో చర్చ ముగిశాకే.. అందరం కలసి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం, ఆ దిశగా ముందుకు చక చక ప్రక్రియను పూర్తి చేస్తుండటంతో.. సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి అగమ్యగోచరంగా మారీంది. 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు కూడా దక్కవని ఆ ప్రాంత నేతలు బహిరంగంగానే వాపోతున్నారు. ఈ నేపథ్యంలో.. పలువురు నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీ, వైసీపీలతో అవగాహనను కుదుర్చుకున్నారు. ఇందులో కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలూ ఉన్నారు.

ఏ పార్టీలోకి వెళ్లే అవకాశం లేని కొందరు నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్తుపై తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఏ పార్టీలో ఇమడని వాళ్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పురుడు పోసుకుంటుందనే ఆశతో ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కొత్త పార్టీ పెడితే తమ తమ రాజకీయ భవిష్యత్ కు ఢోకా వుండని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక కిరణ్ మో.. జనవరి 23దాక ఆగి.. అందరితో చర్చించి నిర్ణయం తీసుకుందామని తాజాగా స్పష్టం చేసినట్లు సమాచారం.

విభజన ముసాయిదా బిల్లుపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి కిరణ్ కొత్త పార్టీ పెట్టనున్నారా.. ? లేదా.. ? సీమాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ దేనని ప్రచారం మొదలుపెడతారా.. ? అనేది వేచి చూడాలి. మరోవైపు, సీఎం మూడునెలల అనంతరం రేపు అధినేత్రి సోణియా గాంధీతో సమావేశం కానున్నారు.

Exit mobile version