Site icon TeluguMirchi.com

జర్నలిస్టుగా.. సీఎం కిరణ్ !

cm kiranరాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి పలుమార్లు ధిక్కారస్వరాన్ని వినిపించారు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే.. విభజనపై నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానానికి కిరణ్ కొరకరాని కొయ్యలా తయారయ్యారు. తెలంగాణ విషయంలో.. ప్రతిపక్ష పార్టీల నుంచి కూడా రాని ప్రతిఘటన.. కిరణ్ రూపంలో సొంత పార్టీ నుంచే కాంగ్రెస్ కు వచ్చిపడింది. ఈ నేపథ్యంలో.. కాంగ్రెస్ అధిష్టానం కిరణ్ ను ప్రక్కకు పెట్టే ఆలోచనలో వుందని గతకొద్దికాలంలో జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే విషయాన్ని విలేకరులు ముఖ్యమంత్రిని ప్రశ్నించగా.. రాజకీయాల్లోనే ఉండాలని ఏముంది.. జర్నలిజంలోకి కూడా ప్రవేశించొచ్చు అంటూ సమాధానమిచ్చారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా..కిరణ్ విలేకరులతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జర్నలిస్టుగా మారవచ్చని సరదా చెప్పినప్పటికినీ..ఆయన చేసిన ఇంకో కామెంట్ రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. అదే.. ’భవిష్యత్ ను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ లేదా సమైక్యాంధ్ర’లలో.. ఎదో ఒకటి తేల్చుకునే పరిస్థితి శత్రువు కూడా రావొద్దని వ్యాఖ్యానించారు.
అంటే..కిరణ్ మదిలో పార్టీని వీడే ఆలోచన వుందని అర్థమవుతోంది. తనలో తను అంతర్మథనం తరవాత ఏదో ఒక డిసిషన్ వుండవచ్చు. అది.. అధిష్టానం మాటకు కట్టుబడి కాంగ్రెస్ లో కొనసాగడం అయినా కావొచ్చు. లేదా.. సమైక్యవాదంతో కొత్త పార్టీని స్థాపించడమైనా.. కావొచ్చు. ఈ రెండింటిలో రెండోదానికే అవకాశం ఎక్కువగా వున్నట్లు విశ్లేషకు భావిస్తున్నారు. ఎందుకంటే.. మొదటిదానికి కట్టుబడి వుండటాన్ని కిరణ్ ఎప్పుడో దాటేశాడు అన్నది వారి భావన.

తాజాగా, కిరణ్ చేసిన కామెంట్ తో రాష్ట్రంలో మరో పార్టీ పురుడు పోసుకుంటుందా.. ? లేదా.. ? అన్నది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. కిరణ్ కాంగ్రెస్ లోనే వుండటం లేదా కొత్త పార్టీ పెట్టడం ఈ రెండు దండగ అనుకుంటే.. ఆయన చెప్పినట్లుగా మరీ జర్నలిజంలోకి ప్రవేశిస్తారా.. ? జర్నలిస్టుగా అవతారవం ఎత్తాలనుకుంటే..మాత్రం హార్ట్ లీ వెల్ కమ్ చెప్పడానికి రెడీగా వున్నారు జర్నలిస్టు సోదరులు. ఏదేమైనా.. నిర్ణయం మాత్రం ముఖ్యమంత్రిదే మరీ…

Exit mobile version