యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ లాకప్ డెత్ పై సీఎం కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మరియమ్మ లాకప్ డెత్ అత్యంత బాధాకరమని, ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లాకప్‌డెత్‌పై తగిన విచారణ చేపట్టి కారణమైన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు, అవసరమైతే వారిని ఉద్యోగం నుంచి తొలగించాలి అని స్పష్టం చేసారు.
ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీనిచ్చారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు, రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ.10 లక్షల ఆర్థికసాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.