Site icon TeluguMirchi.com

బాబు-రమణా…జగన్ దెబ్బ మాములుగా లేదు!

ఏపీ సీఎం జగన్ మోహన్  రెడ్డి వార్ ప్రకటించారు. ఇది మామూలు వార్ కాదు. ఏకంగా  ఒక జస్టిస్ మీద వార్. ఇది మామూలు విషయం కాదు. దీనికి చాలా దమ్మువుండాలి. తనకి అలాంటి దమ్మువుందని నిరూపిస్తూ.. జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఓ అవినీతి పరుడు, చంద్రబాబుతో కలసి నా ప్రభుత్వాన్ని దించాలని ప్లాన్ వేస్తున్నాడని ఏకంగా భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు జగన్. ఇది దేశ చరిత్రలో సంచలనం.

న్యాయవ్యవస్థని అడ్డుపెట్టుకొని కొందరు అవినీతి చక్రవర్తులుగా మారారు. చట్టాన్ని తమ అవినీతి రక్షణ కవచంగా మార్చుకొని కోట్లుకు పడగలెత్తారు. అంతేకాదు కోర్టు కోర్టు కి న్యాయం మారిపోయి,  నచ్చినట్లు ఆడుకుంటున్నారు కొందరు న్యాయ కోవిదులు. అలాంటి అవినీతి తిమింగిలాల మీద చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా వుందనే భావన ఎప్పటినుండో వుంది. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి దానికి శ్రీకారం చుట్టినట్టుగా వున్నారు.

ప్రజాస్వామ్యంలో ఎవరికీ అపరిమితమైన అధికారులు లేవు. న్యాయ మూర్తి రేప్ చేస్తే.. అతడు న్యాయ వ్యవస్థకు చెందిన వాడిని వదిలేయలేం కదా.. తప్పు ఎవడు చేసిన తప్పే. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు చాలా సీరియస్ ఆరోపణలు చేశారు. చంద్రబాబు- జస్టిస్‌ ఎన్‌.వి.రమణ .. ఇద్దరూ అవినీతి చక్రవర్తులు… జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, చంద్రబాబుకి అమ్మడు పోయారు,, నా ప్రభుత్వాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ న్యాయ వ్యవస్థని అడ్డుపెట్టుకొని అస్థిర పరచాలని చూస్తున్నారని ఏకంగా  భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం ఇప్పుడు దేశంలో సంచలనం.

అసలు ఇంత ధైర్యం జగన్ కి ఎక్కడి నుండి వచ్చింది? అంటే .. దీని వెనుక చాలా గ్రౌండ్ వర్క్ చేశారు జగన్. మొన్న జగన్ ఢిల్లీ వెళ్ళింది ఎర్రకోటని చూడ్డానికి కాదు.. మోడీ సాక్షిగా  జగన్నాధ రధ చక్రాలు తిరిగాయి. ఇప్పుడు లేఖ బయటికి వచ్చింది. జగన్ మోహన్ రెడ్డి దెబ్బకి ఇటు చంద్రబాబు , అటు రమణ .. ఫ్రీజ్ అయిపోయే పరిస్థితి. కారణం… జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన. మోడీ,..  జగన్ కి ఏమని మాటిచ్చారో, దీనికి వెనుక వున్న వ్యూహం ఏమిటో తెలుసుకొనే పనిలో చాలా చాలా చాలా బిజీగా వున్నారు ఈ  ఇద్దరు. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన  వార్  మామూలుది కాదు. ఏపీ రాజకీయాల్లో కొన్ని మైండ్ బ్లోయింగ్ సీన్స్ కనిపిస్తాయి. లెట్స్ సీ… 

Exit mobile version