తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించిన జగన్ ఇవాళ మరోసారి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఉదయం ఆరు గంటలకు ఆలయానికి చేరుకొని శ్రీనివాసుడిని దర్శించుకొని తులాభారం వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. తన బరువుకు సమానంగా 78 కిలోల బియ్యం శ్రీవారికి సమర్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు వేదాశీర్వచనం చేశారు. TTD ఛైర్మన్ YV సుబ్బారెడ్డి, EO జవహర్‌రెడ్డి కలిసి స్వామివారి తీర్థప్రసాదాలను సీఎంకు అందజేశారు.