సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్ళలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఓక్కొక్కరికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఈరోజు స్పందన కార్యక్రమంలో భాగంగా సీఎం కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనికి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పై కలెక్టర్ల ఇచ్చిన ఫీడ్ బ్యాక్ తో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం.

 

గత ప్రభుత్వం కేవలం 391 మందికి మాత్రమే పరిహారం అందించింది. ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ఇప్పటి వరకూ 1,513 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు రికార్డులున్నాయి. ఇంకా ఎవరైనా అర్హులున్నా గుర్తించి పరిహారం చెల్లించాలని కలెక్టర్లని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లే నేరుగా బాధిత రైతు కుటుంబం దగ్గరికి వెళ్లి పరిహారం అందించాలన్నారు సీఎం జగన్. ఎమ్మెల్యేలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాలని జగన్ సూచించారు. ఎక్కడైనా సరే… రైతు కుటుంబాల్లో జరగ రానిది జరిగితే.. వెంటనే కలెక్టర్‌ స్పందించాలన్నారు.