విద్యుత్‌శాఖకు పలు ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్


ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో విద్యుత్‌శాఖపై గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి మంత్రి మంత్రి పెద్దిరెడ్డి సహా ఉన్నతాధికారులు హాజరయ్యారు.థర్మల్‌ కేంద్రాల వద్ద సరిపడా బొగ్గునిల్వలు ఉండేలా చూసుకోవాలని, దీని కోసం సరైన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ‘విద్యుత్‌ డిమాండ్‌ అధికంగా ఉన్న రోజుల్లో పూర్తి సామర్థ్యంతో పవర్‌ప్లాంట్లు నడిచేలా చూసుకోవాలి. కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు బొగ్గు సప్లై జరిగేలా చూసుకోవాలి. ఏపీఎండీసీ నిర్వహిస్తున్న సులియారీ బొగ్గు గని నుంచి మరింత మెరుగ్గా ఉత్పత్తి జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ మెటార్లకు మీటర్లు వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు చెప్పాలని, దీనిపై రైతులకు లేఖలు రాయాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు.