కడప జిల్లాలో ఈనెల 7,8 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేసింది. 7వ తేదీ ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి 9.20 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ 9.30కి బయలుదేరి 10.20 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.30కి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి 10.55కు పులివెందులలోని బాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 10.55కు హెలీప్యాడ్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు పులివెందులలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహానికి చేరుకుంటారు.