ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సీఎం జగన్ గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ బయలుదేరి వెళతారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, పెండింగ్ లో ఉన్న అంశాలపై ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ చర్చించే అవకాశముందని సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర మంత్రులను కూడా జగన్ కలిసే అవకాశముందని చెబుతున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు నిధుల విడుదల, ప్రత్యేక హోదా, మూడు రాజధానుల విషయంపై జగన్ చర్చించే అవకాశాలున్నాయని సమాచారం అందుతుంది. ఇక ఈ నెలలో సీఎం జగన్ ఢిల్లీపర్యటన ఇది రెండవసారి కావడం వల్ల ప్రధానితో ఎటువంటి విషయాలు చర్చకు వస్తాయనేది ఏపీ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.