Site icon TeluguMirchi.com

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఆకస్మిక పర్యటన

వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా సీఎం శ్రీ వైఎస్ జ‌గ‌న్ శుక్ర‌వారం చిత్తూరు జిల్లా రేణిగుంట, ఏర్పేడు మండలం, వైయ‌స్ఆర్ జిల్లా పుల‌ప‌త్తూరు లో ప‌ర్య‌టించి బాధితుల‌ను ప‌రామ‌ర్శించారు. అధికారులు వ‌చ్చారా, ప్ర‌భుత్వ సాయం అందిందా అని ప‌ల‌క‌రిస్తూనే అధికారుల‌కు ప‌లు ఆదేశాలు జారీ చేశారు. పాపానాయుడుపేట వ‌ద్ద స్వర్ణముఖి నదిపై వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని సీఎం పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా రహదారులు, భవనాలు, వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.

Exit mobile version