అసంపూర్తిగా ముగిసిన చర్చలు!

cm kiranముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీతో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిశాయి. సీఎం క్యాంప్ ఆఫీసులో దాదాపు నాలుగు గంటల పాటు సాగిన చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా విద్యుత్ ఉద్యోగులు సమ్మెను విరమించాలని కోరగా, సమ్మె విరమణకు సంబంధించి అన్ని జిల్లాల జేఏసీ నేతలతో మాట్లాడిన తర్వాత… తమ నిర్ణయాన్ని తెలుపుతామని జేఏసీ నేతలు సీఎంకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఉద్యోగులు దాటవేసే ధోరణలో రేపు నిర్ణయం తీసుకుంటామని అన్నట్లు తెలుస్తోంది. అయితే, పరిస్థితి చాలా దారుణంగా వుందని.. ఈరోజే నిర్ణయాన్ని తీసుకోవాలని సీఎం కోరినట్లు సమాచారం. దీంతో.. ఈరోజు సాయంత్రం 7 గంటలకు మరోసారి సమావేశం కావాలని కేబినెట్ సబ్ కమిటీ, ఉద్యోగ జేఏసీ నేతలు నిర్ణయించారు. మరి సాయంత్రం మరో దఫా జరిగబోయే సమావేశంలోనైనా చర్చలు ఓ కొలిక్కి వస్తాయేమో వేచి చూడాలి.